ఇదెక్కడి మాస్ రా మావ..! ఓ వైపు పెళ్లి.. మహేష్ బాబు టీజర్.. పెళ్ళికొడుకు ఏం చేశాడంటే
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 పేరుతో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా.. కొన్నాళ్ల క్రితం విడుదలైన మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేయగా.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ మూవీ తొలి ఈవెంట్ లో టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వారి సమక్షంలోనే సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటించారు. 2027 మార్చ్ లో వారణాసి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక రామోజీ ఫిలిమ్ సిటీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ తోపాటు, టైటిల్ ను , సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇది కదా మాకు కావాల్సింది.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే లేటు అంటూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక టైలర్ లో మహేష్ బాబు లుక్, వీడియోలో కనిపించిన విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో మహేష్ బాబు ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
ఇదిలా ఉంటే మహేష్ బాబు వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఈవెంట్ రోజే ఆ అభిమాని పెళ్లి.. దాంతో పెళ్లి వేడుకలో ఓ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాడు. కరెక్ట్ గా మహేష్ బాబు వారణాసి టీజర్ వచ్చే సమయానికి స్టేజ్ పైన పెళ్లి కూతురిని ఒక్కదాన్నే వదిలేసి స్నేహితులతో కలిసి స్క్రీన్ ముందు కూర్చొని టీజర్ ను ఎంజాయ్ చేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ లో విజిల్స్ వేస్తూ సందడి చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ అభిమానులు ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




