కన్న తండ్రిని, ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు.. పైకి సాఫ్ట్‌వేర్.. లోన హార్డ్‌వేర్ క్రిమినల్ ఈ ఐబొమ్మాళి రవి
పైకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్ క్రిమినల్. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐ బొమ్మాళి రవి.. పర్సనల్ లైఫ్‌లో కూడా సేమ్ టు సేమ్ రోల్‌ను పోషించాడు. రియల్ లైఫ్‌లో ప్రేమించిన అమ్మాయిని వదిలెయ్యడంతో పాటు, అటు తండ్రిని కూడా గాలికి వదిలేశాడు.

పైకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్ క్రిమినల్. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐ బొమ్మాళి రవి.. పర్సనల్ లైఫ్‌లో కూడా సేమ్ టు సేమ్ రోల్‌ను పోషించాడు. రియల్ లైఫ్‌లో ప్రేమించిన అమ్మాయిని వదిలెయ్యడంతో పాటు, అటు తండ్రిని కూడా గాలికి వదిలేశాడు. పండుటాకులా మారిన తండ్రిని పొదివి పట్టుకోవాల్సిన చేతులతో, పైరసీలు చేస్తూ అటు సమాజానికి, ఇటు తండ్రికీ చెడబుట్టిన కొడుకుగా మారాడు.
తండ్రి బతకడానికి నానా అవస్థలు పడుతుంటే…కొడుకు మాత్రం మంది మీద పడి బతికేస్తున్నాడు. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించి, వందల సినిమాలు పైరసీ చేసి, వేలాదిమంది బతుకుతెరువును దెబ్బతీసిన ఈ బద్మాష్…కరో కరో జర జల్సా అంటున్నాడు. ఐబొమ్మ రవి కోట్లు సంపాదించినా, తండ్రికి మాత్రం నయాపైసా సాయం చేయలేదు సరికదా, ఎలా ఉన్నావు? తిన్నావా అని ఆప్యాయంగా అడగడం కూడా మానేశాడు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన చేతులు…. సినిమాలు పైరసీ చేయడంలో బిజీగా మారిపోయాయి.
ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి.. పైరసీ కింగ్‌పిన్‌గా మారిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సొంతూరు విశాఖపట్నం. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ రవి తండ్రి చిన అప్పారావు విశాఖలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఓపిక ఉంటే వండుకోవడం..లేదా బయట తెచ్చుకుని తినడం..అది కూడా కుదరకపోతే పస్తులుండడం. ఈ పండుటాకుకు రాలిపోయే దశలో ఇంత దురవస్థ పట్టించాడు తనయుడు. రవి తన బాగోగులను పట్టించుకోడంటున్నారు అప్పారావు. తనకు వచ్చే పెన్షన్‌తోనే బతుకు బండి లాగిస్తున్నానన్నారు ఆయన.
రాంగ్ రూట్‌లో వెళ్లడం తప్పు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేశాడు అంటూ…ఐబొమ్మ రవి కేరక్టర్‌ని ఒక్క ముక్కలో తేల్చేశారు తండ్రి అప్పారావు.
‘‘రవిపై కేసుల గురించి నాకు తెలియదు. సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. రవి విషయం హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారు.15 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు.. రెండు నెలల క్రితమే రవితో మాట్లాడా’’.. అంటూ అప్పారావు పేర్కొన్నారు.
వీడియో చూడండి..
ఉన్నది చాలదా ఎంత తింటావు అంటూ రవికి గడ్డి పెట్టారు అప్పారావు. ఎలాంటి కొడుకును కన్నానురా దేవుడా! ఇదంతా తన ఖర్మ అంటూ వాపోయారు ఆయన.
చెడబుట్టిన కొడుకు వల్ల ఈ వృద్ధాప్యంలో ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ అప్పారావు కుమిలిపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
