Megastar Chiranjeevi: చిరంజీవిని కలవాలని అభిమాని నిరాహార దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నలగొండరాయని పల్లికి చెందిన రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి పై ఉన్న అభిమానంతో చిరు ప్రతి సినిమా రిలీజ్ ఫస్ట్ డే… ఫస్ట్ షో చూసేవారు రామకృష్ణ. చిరంజీవిని కలిసేందుకు 20, 30 సార్లు ప్రయత్నం చేశారట అభిమాని రామకృష్ణ. కానీ ఎంత ప్రయత్నించినా మెగాస్టార్ చిరంజీవి కలవకపోవడంతో.. ఆయనను కలిసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అని నిర్ధారించుకున్న అతడు ఏకంగా నిరాహారదీక్ష చేపట్టాడు. చిరంజీవి కోసం టెంట్ వేసుకుని నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. తన నిరాహార దీక్షతో అయినా చిరంజీవి కలుస్తాడని రామకృష్ణ ధీమాతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి తాను రాసిన జానపద కథ స్క్రిప్ట్ చిరంజీవికి చెప్పి ఒప్పించి చిరుతో సినిమా తీయాలని ఉందంటున్నారు అభిమాని రామకృష్ణ. మెగాస్టార్ చిరంజీవిని కలిసే వరకు నిరాహార దీక్ష ఆపేది లేదని…. ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు అభిమాని రామకృష్ణ. 30 ఏళ్ల వయసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి అభిమానిగా ఉన్న రామకృష్ణ. ఇప్పుడు తనకు 60 ఏళ్ళ వయస్సు వచ్చినా చిరంజీవిని కలవకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడట. వీరాభిమాని రామకృష్ణకు చిరు అంటే ఎంత అభిమానమో అనుకుంటున్నారు ఇది తెలిసిన వారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..




