- Telugu News Photo Gallery Cinema photos Fahadh FaasilPurchased Volkswagen Golf GTI Car, Know This Price and Features
Fahadh Faasil: అరుదైన కారు కొన్న పుష్ప విలన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ?
దక్షిణాదిలో సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్. హీరోగానే కాకుండా విలన్ పాత్రలతోనూ అదరగొట్టేస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. మలయాళి చిత్రపరిశ్రమకు చెందిన ఫహద్ ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో విలన్ పాత్రతో ఇరగదీశారు. ఈ సినిమాతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది..
Updated on: Jun 25, 2025 | 1:19 PM


ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే ఇతర హీరోల మాదిరిగానే ఫహద్ సైతం ఆటో మొబైల్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న నటుడు. అతడి వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఫహద్ ఫాసిల్ అరుదైన కారును కొన్నాడు. అతడి గ్యారేజీలోకి వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కారు వచ్చింది.

ఈ కారు సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఇందులోని ఫీజర్స్, స్పెషాలిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారతదేశంలో కేవలం 150 వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కార్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 53 లక్షలు, ఆన్-రోడ్ ధర 60 లక్షల కంటే ఎక్కువ. ఇది కేవలం 5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

అలాగే ఈ కారులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్, ఇంటీరియర్, భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా వేడి-వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI కంటే చాలా ఖరీదైన కార్లు ఫహద్ ఫాసిల్ ఇంట్లో ఉన్నాయి. రెండు కోట్ల విలువైన ఫెరారీ 911 సెర్రెరా, ఐదు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 AMG, నాలుగున్నర కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి.

ఇవే కాకుండా ఫహద్ వద్ద అనేక చిన్న కార్లు సైతం ఉన్నాయి. మలయాళీ చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోస్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వద్ద సైతం అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే విదేశీ మోడల్ కార్లు, బైక్స్ సైతం ఉన్నాయి.




