- Telugu News Photo Gallery Cinema photos Krithi Shetty Upcoming Movies In Tollywood, Tamil and Malayalam
Krithi Shetty : టాలీవుడ్లో కనిపించని బేబమ్మ.. తెలుగు సినిమాలకు దూరమవుతుందా ?
కేవలం ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది హీరోయిన్ కృతి శెట్టి. బేబమ్మ పాత్రతో తెలుగు అడియన్స్ హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే కట్టిపడేసింది. అందం, అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ అదృష్టమే కలిసిరాలేదు.
Updated on: Jun 25, 2025 | 1:57 PM

ఉప్పెన సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ వయ్యారి. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకుంది ఈ వయ్యారి. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

అయితే వరుసగా మూడు హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. వరుసగా హ్యాట్రిక్స్ హిట్స్ అందుకున్న మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మనమే వంటి సినిమాలు వరుస ప్లాపులు పడ్డాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

ప్రస్తుతం జస్ట్ ఫర్ ఛేంజ్ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో అక్కడ బేబమ్మకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటుంది. కార్తీ సరసన వా వాతియార్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా అనుహ్యంగా వాయిదా పడింది.

అలాగే తమిళంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 18న అడియన్స్ ముందుకు రానుంది. వీటితోపాటు జీని అనే తమిళంలో చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా బేబమ్మకు తమిళంతోపాటు మలయాళంలోనూ మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో క్రేజ్ ఛాన్స్ కొట్టేసింది.

పృథ్వీరాజ్ సుకుమార్ రూపొందిస్తున్న ఖలీఫా చిత్రంలో ఈ అమ్మడు కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. 2022లోనే ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటికీ .. పృథ్వీరాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో సినిమా ఆలస్యమయ్యింది. ఇక ఇప్పుడు జూలై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.




