
ఫహద్ ఫాజిల్.. ఈ పేరు తెలియని సినీప్రియుడు ఉండరు. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఫహద్.. పుష్ప సినిమాతో విలన్ పాత్రలో ఇరగదీశారు. అలాగే విక్రమ్ సినిమాలోనూ సహయ నటుడిగా మెప్పించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర న్యూస్ వైరలవుతుంది. ఇంతకీ ఏంటో తెలుసా.. ? అదేంటంటే.. ఫహద్ చేతిలో ఉన్న బుడ్డ ఫోన్. తాజాగా నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ పూజా కార్యక్రమానికి ఫహద్ ఫాసిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఫహద్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఈ వీడియోలో ఫహాద్ చేతిలో ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు విలువైన స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో తోపు హీరో అయినప్పటికీ ఫహద్ చేతిలో చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. దీంతో ఆ ఫోన్ గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫహద్ “గ్లోబల్ బ్రాండ్ వెర్టు నుండి వెర్టు అసెంట్ – 4 జిబి – బ్లాక్” అనే ఫోన్ ఉపయోగిస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర $1199 అంటే దాదాపు లక్ష రూపాయాల వరకు ఉంటుంది. వెర్టు అసెంట్ టి ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ 2008 లో ప్రారంభించబడింది. టైటానియం బాడీ, స్క్రాచ్-రెసిస్టెంట్ నీలమణి క్రిస్టల్ డిస్ప్లే, ఫెరారీ, లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది నోకియా ఫీచర్ ఫోన్‌లలో సాధారణంగా ఉపయోగించే సింబియన్ OS ఆధారంగా కస్టమ్ వెర్టు ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది.
ఇదిలా ఉంటే.. ఫహద్ ఫాజిల్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే కెమెరా ముందుకు రావడం.. సెల్ఫీ, ఫోటోస్ తీసుకోవడం తనకు అంతగా నచ్చదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..