AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha: ఇండియన్ ఆర్మీని అవమానించారంటూ.. అమీర్ సినిమా పై మండిపడ్డ ప్రముఖ క్రికెటర్..

ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే బజ్ కంటే ముందు వివాదాలు పలకరిస్తాయి. ఆ సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయం పై ఎదో ఒక రకంగా వివాదం చెలరేగుతూనే ఉంది

Laal Singh Chaddha: ఇండియన్ ఆర్మీని అవమానించారంటూ.. అమీర్ సినిమా పై మండిపడ్డ ప్రముఖ క్రికెటర్..
Lal Singh Chaddha
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2022 | 2:56 PM

Share

ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే బజ్ కంటే ముందు వివాదాలు పలకరిస్తాయి. ఆ సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయం పై ఎదో ఒక రకంగా వివాదం చెలరేగుతూనే ఉంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు రకరకాల వివాదాలు రేగుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాకు కూడా అదే జరిగింది. అమీర్ ఖాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లాల్ సింగ్ చడ్డా సినిమాను ఆపేయాలని హిందూ సంఘాలు ఆరోపించిన విషయం తెలిసిందే.

గతంలో అమీర్ ఖాన్ ఈ దేశంలో సేఫ్టీ లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. అమీర్ లాల్ సింగ్ చడ్డా సినిమాను బాయ్ కాట్ చేయాలనీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ అమీర్ సినిమా పై మండిపడ్డారు. లాల్ సింగ్ చడ్డా ఇండియన్ ఆర్మీని, సిక్కులను దారుణంగా అవమానించిందని ఆయన ఆరోపించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘ఫారెస్ట్ గంప్` అనే సినిమాను అమెరికా ఆర్మీకి పర్వాలేదు, ఇండియన్ ఆర్మీకి మాత్రం ఓకే కాదు. వియత్నాం యుద్ధం కోసం అమెరికా మంద బుద్ది ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంది. కానీ ఈ విషయంలో `లాల్ సింగ్ చడ్డా` ఇండియన్ ఆర్మీని, సిక్కులను అవమానించేలా ఉంది. అంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి