Vijay Antony: విజయ్‌ ఆంటోనీ కూతురు మరణానికి కారణమిదే.. పోస్ట్‌మార్టం రిపోర్టులో వైద్యులు ఏం చెప్పారంటే?

కోలీవుడ్ హీరో అండ్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.మంగళవారం (సెప్టెంబర్‌ 19) తెల్లవారుజామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది మీరా ఆంటోని. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పారు. దీంతో విజయ్‌ ఆంటోని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Vijay Antony: విజయ్‌ ఆంటోనీ కూతురు మరణానికి కారణమిదే.. పోస్ట్‌మార్టం రిపోర్టులో వైద్యులు ఏం చెప్పారంటే?
Vijay Antony Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2023 | 5:11 PM

కోలీవుడ్ హీరో అండ్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.మంగళవారం (సెప్టెంబర్‌ 19) తెల్లవారుజామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది మీరా ఆంటోని. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పారు. దీంతో విజయ్‌ ఆంటోని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు విజయ్‌ కూతురు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీరా ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. మరోవైపు తాజాగా మీరా ఆంటోని మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా పూర్తయ్యింది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మీరా శవ పరీక్ష జరగ్గా… ఆమెది ఆత్మహత్యే అంటూ రిపోర్టులో స్పష్టం చేశారు వైద్యులు. ఇక విజయ్‌ ఆంటోనీ కూతురు మృతదేహానికి అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. గత కొన్ని రోజులుగా మందులు వాడుతుందని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పాటు మీరా చదువుతున్న చర్చి పార్క్ స్కూల్‌తో పాటు తన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే మీరా ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్యతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెబుతున్నారు. విశాల్, రాధికా శరత్‌కుమార్‌, జయం రవి, కస్తూరిశంకర్‌, రాఘవ లారెన్స్‌, లోకేష్‌ కనగరాజ్‌, జీవీ ప్రకాష్‌ కుమార్‌, పార్తీబన్‌ తదితర సినీ ప్రముఖులు విజయ్‌ కుటుంబ సభ్యులకు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మ్యూజిక్‌ కంపోజర్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, లిరిసిస్ట్‌గా, ఎడిటర్‌గా.. ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఇటీవలే దీనికి సీక్వెల్‌ గా వచ్చిన బిచ్చగాడు 2 సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సినీ ప్రముఖల సంతాపం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?