- Telugu News Entertainment Tollywood Do you these top superhit dubbing movies in 2022 check here details telugu cinema news
Year Ender 2022: ఈ ఏడాదిలో అదరగొట్టిన డబ్బింగ్ చిత్రాలు ఇవే.. గార్గి నుంచి కాంతార వరకు..
ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద సౌత్ చిత్రాల హవా నడుస్తుంది. తెలుగు సినిమాలే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. తెలుగులోకి డబ్ అయి కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
Updated on: Dec 11, 2022 | 3:49 PM

ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద సౌత్ చిత్రాల హవా నడుస్తుంది. తెలుగు సినిమాలే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. తెలుగులోకి డబ్ అయి కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశారు యశ్.

అలాగే విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించింది. కలెక్షన్స్ పరంగా అంతగా రాకపోయినా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పూజా హెగ్డే నటించింది.

ఇక నయనతార, సమంత నటించిన కణ్మని కతీజా రాంబో సినిమా డిజాస్టర్ కాదా.. శివ కార్తికేయన్ నటించిన డాన్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక జూన్ లో వచ్చిన చార్లి 777 సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.

ఇక ఆ తర్వాత కమల్ హసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన గార్గి చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్స్ అంతగా రాబట్టలేకపోయినా.. నటనపరంగా సాయి పల్లవి మరోసారి మెప్పించింది.

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, కార్తి నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా సైతం ఆకట్టుకుంది.

చివరగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.




