Tollywood: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్.. ఈ అమ్మడిలాంటి లవర్ ఉండాలని కుర్రాళ్ళు కలలు కనేవారు..
తాజాగా పైన కనిపిస్తోన్న చిన్నారి ఫోటో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆ చిన్నారి హీరోయిన్ గా ఒకానొక సమయంలో రాణించింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా తరాలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తాజాగా పైన కనిపిస్తోన్న చిన్నారి ఫోటో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆ చిన్నారి హీరోయిన్ గా ఒకానొక సమయంలో రాణించింది. కుర్రకారు ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. ఇంతకు ఆ చిన్నది ఎవరో తెలుసా..?
ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు. ఒకప్పుడు కుర్రకారును నిద్రపోనివ్వకుండా చేసిన కలర్స్ స్వాతి. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే సినిమాలో త్రిష సిస్టర్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత నాని నటించిన అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా మారింది.
తొలి సినిమాతోనే నటన, అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. తెలుగులో చాలా సినిమాల్లో నటించిన స్వాతి తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక స్వాతి నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది ఈ భామ. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
View this post on Instagram