Nee Sneham: నీ స్నేహం సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

స్నేహం కోసం ప్రేమను వదులుకునే కుర్రాడి పాత్రలో కనిపించారు ఉదయ్ కిరణ్. ఈ సినిమాలో అర్తి అగర్వాల్, విశ్వనాథ్ కీలకపాత్రలు పోషించారు. 2002 నవంబర్ 1న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. స్నేహం, ప్రేమ రెండూ విడదీయలేని బంధాల్ని కథాంశంగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా

Nee Sneham: నీ స్నేహం సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Jathin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2024 | 11:04 AM

టాలీవుడ్ ప్రేక్షకులకు ఉదయ్ కిరణ్ ఒక ఎమోషనల్ అటాచ్‏మెంట్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. హృదయాలను కదిలించే ప్రేమకథలతో అప్పట్లో యూత్‏ను ఆకట్టుకున్నారు. ఒకప్పుడు ఉదయ్ కిరణ్ కు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ఈ హీరో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి. స్నేహం కోసం ప్రేమను వదులుకునే కుర్రాడి పాత్రలో కనిపించారు ఉదయ్ కిరణ్. ఈ సినిమాలో అర్తి అగర్వాల్, విశ్వనాథ్ కీలకపాత్రలు పోషించారు. 2002 నవంబర్ 1న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. స్నేహం, ప్రేమ రెండూ విడదీయలేని బంధాల్ని కథాంశంగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా నటించిన నటుడు జతిన్. ప్రాణస్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాయి.

నీ స్నేహం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ముంబైలో జన్మించిన జతిన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ మూవీస్ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు టీవీ కార్యక్రమాల్లోనూ కనిపించారు. హిందీతోపాటు, తెలుగు, పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ ఎక్కువగా నీ స్నేహం సినిమాతోనే క్రేజ్ తెచ్చుకున్నారు.

నటుడిగా చాలా తక్కువ సినిమాల్లో కనిపించిన జతిన్.. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు జతిన్. వీరికి ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. జతిన్ తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?