AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చేసింది. ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పటికీ ఆమె తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఇంతకీ గుర్తుపట్టారా..?

Nagarjuna: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Nagarjuna, Girija
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2025 | 8:02 PM

Share

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆరుపదుల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్.. ఇప్పుడు రూటు మార్చారు. యంగ్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ధనుష్ నటించిన కుబేర చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. ఇక తాజాగా రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలో విలన్ పాత్రలో ఇరగదీశారు. ఇందులో సైమన్ పాత్రలో అద్భుతమైన నటనతో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఇదిలా ఉంటే.. గతంలో నాగార్జనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. అక్కినేని నాగార్జున సరసన ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. అప్పట్లో ఆమె కుర్రకారు కలల రాకూమారి. అందం, అభినయంతో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంతకీ మీరు ఆమెను గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ గిరిజ. 1989లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమా ఓ స్థాయిలో సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈమూవీ ఎవర్ గ్రీన్ హిట్. ఇందులోని పాటలు సైతం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇందులో నాగార్జున, గిరిజ కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది గిరిజ.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

తెలుగులో ఒక్క సినిమా చేసిన గిరిజ.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఆమె పూర్తి పేరు గిరిజ షెత్తార్. 1969 జూలై 20న జన్మించిన ఆమెను ఇంగ్లాండ్ నుంచి భారతీయ సినిమాల్లోకి తీసుకువచ్చారు మణిరత్నం. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని రోజుల క్రితం కన్నడ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన తబ్బిడ ల్లెలి చిత్రంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

Geethanjali Movie

Geethanjali Movie

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..