Tollywood : శ్రీకాంత్తో సూపర్ హిట్ సినిమా.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది..
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. గ్లామర్ తోపాటు.. అభినయంతో జనాలను కట్టిపడేశారు. కానీ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూతురి ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు ? అనే విషయాలు తెలుసుకుందామా.

తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది తారలు అలరించారు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఒకప్పుడు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆమెను గుర్తుపట్టారా.. ? శ్రీకాంత్ సరసన ఓ హిట్ మూవీ చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ మహిమా చౌదరి. తెలుగులో శ్రీకాంత్ సరసన మనసులో మాట అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ హిందీలో మాత్రం అనేక హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు దాదాపు ఒక దశాబ్దం పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న మహిమా చౌదరి.. ఇప్పుడు 2024లో తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు హిందీలోనే అధిక ఆఫర్స్ అందుకుంటుంది.
ఇదెలా ఉంటే.. ఇప్పుడు మహిమా చౌదరి కూతురు ఆర్యనా చౌదరి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన తల్లితో కలిసి అనేక ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటుంది. ఆమె వయసు ప్రస్తుతం 18 సంవత్సరాలు మాత్రమే. కానీ అందంలో తల్లిని మించిపోయింది. ఇటీవలే ఆమె గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆర్యనా తన తల్లి మహిమా చౌదరి కాపీలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఆర్యనా సైతం ఇండస్ట్రీలోకి నటిగా తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
ఒకప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించిన మహిమా చౌదరి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె కంగనా రనౌత్ నిర్మించిన ఎమర్జెన్సీ చిత్రంలో నటించింది. ఇప్పుడు దుర్లభ్ ప్రసాద్ తో కలిసి సంజయ్ మిశ్రా చేస్తున్న సినిమాలో బిజీగా ఉంది.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..








