- Telugu News Photo Gallery Cinema photos Is this the missing film in the Mahesh Babu and Priyanka Chopra combination?
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్‌లో మిస్సైన సినిమా ఏదో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరకవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ప్రియాంక చోప్రో హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా మూవీ టీం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చిన్నది పసుపు రంగు చీరలో, చేతిలో గన్ పట్టుకొని, డిఫరెంట్‌గా కనిపించింది. ఈ ఫొటో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
Updated on: Nov 15, 2025 | 3:16 PM

ఇక దర్శకుడు రాజమౌళి కొన్ని రోజుల పాటు, మూవీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అభిమానులకు ఇవ్వలేదు. చాలా సీక్రెట్‌గా సినిమా షూటింగ్ జరిపించేశాడు. కానీ ఈ మధ్య వరసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ, మహేష్ బాబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ చిత్ర బృదం రిలీజ్ చేసిన తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది. అది ఏమిటంటే. ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు చూద్దాం.

చిత్ర పరిశ్రమలో చాలా కాంబోలు మిస్ అవుతుంటాయి. అలాగే, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో కూడా ఓ డిజాస్టర్ మూవీ మిస్ అయ్యిందంట. ఇంతకీ ఆ చిత్రం ఏదో కాదు, నాని మూవీ. ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు, అమీషా పటేల్ జంటగా నటించిన మూవీ నాని.ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా చిత్ర బృదం ప్రియాంక చోప్రాను సంప్రదించారంట. ఆమెకు కూడా మహేష్ బాబుతో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండటంతో అవకాశం రాగానే మూవీకి ఒకే చెప్పిందంట. కానీ తర్వాత డేట్స్ సర్దు బాటు కాకపోవడంతో,ఈ బ్యూటీ నాని సినిమాలో అవకాశాన్ని చేజార్చుకుంది.

అలా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో రావాల్సిన నాని సినిమా మిస్ అయ్యింది. అప్పుడు ఈ కాంబినేషన్ మిస్ అయినా, మళ్లీ ఇప్పుడు వరల్డ్ ప్రాజెక్ట్‌లో ఈ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తుతం దీనికి సబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



