AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. వందల కోట్ల ఆస్తులు..

ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో హిట్స్ అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. నాగార్జున, రవితేజ సరసన బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది. దాదాపు 18 ఏళ్లుగా సినిమాలు చేయకుండా ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన ఈ హీరోయిన్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తులకు యజమాని.

Actress: రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. వందల కోట్ల ఆస్తులు..
Rakshitha
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2025 | 10:44 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు.. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన హీరోయిన్స్.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. తెలుగులో రవితేజ, నాగార్జున సరసన నటించి భారీ విజయాన్ని అందుకున్న ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? దాదాపు 18 సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన ఆమె.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రక్షిత. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు కుర్రాళ్ల దిల్ క్రష్. సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లలో ఆమె ఒకరు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

రక్షిత ప్రేమ్.. తెలుగు, తమిళం, కన్నడ సహ అనేక భాషలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రక్షిత 1984లో బెంగళూరులో జన్మించారు. నటి రక్షిత తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.సి. గౌరీశంకర్ , తల్లి నటి మమతా రావు. రక్షిత 2007లో దర్శకుడు ప్రేమ్‌ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 2002లో పునీత్ రాజ్ కుమార్ నటించిన అప్పు చిత్రంతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో రవితేజ సరసన ఇడియట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే నాగార్జున, ఆసిన్ కాంబోలో వచ్చిన శివమణి చిత్రంలోనూ నటించింది. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్ ప్రేమ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినీరంగానికి దూరమైంది. ప్రేమ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

ప్రస్తుతం కన్నడలో పలు షోలకు న్యాయ నిర్ణేతగా ఉంటుంది. అలాగే నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. 2012లో శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రక్షిత, 2013లో జేడీఎస్ పార్టీలో చేరారు. తరువాత, 2014లో బీజేపీలో చేరారు. 18 సంవత్సరాలుగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇప్పటికీ ఆమె ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.

Rakshitha New

Rakshitha New

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

Follow Us