Cinema : 20 కోట్లతో నిర్మిస్తే 200 కోట్ల కలెక్షన్స్.. 2024లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పుడు ఇలా..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇది. ఏకంగా 10 అవార్డ్స్ గెలుచుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ 2024లో విడుదలై అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా గురించి మీకు తెలుసా.. ? మలయాళంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం అదే వర్గానికి చెందినది. కేవలం రూ.20 కోట్లతో నిర్మి్స్తే ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఏకంగా 10 అవార్డులు గెలుచుకుంది. 2024లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా పేరు బ్రహ్మయుగం. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు మమ్ముట్టి. ఇటీవల నవంబర్ 3 సోమవారం త్రిస్సూర్ లో ప్రకటించిన అవార్డులలో మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో బ్రహ్మయుగం సినిమా సత్తా చాటింది. 74 వయసులో యంగ్ హీరోలకు పోటీగా సహజ నటనతో కట్టిపడేశారు మమ్ముట్టి. ఇందులో రెండు పాత్రలకు ప్రాణం పోశారు మమ్ముట్టి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. రెడ్ రెయిన్, భూతకాలం వంటి చిత్రాల తర్వాత రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన సినిమా బ్రహ్మయుగం. . అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డ లిస్ ప్రధాన పాత్ర పోషించారు. భ్రమయుగంలో ప్రదర్శన ద్వారా సిద్ధ్ భరతన్ అత్యుత్తమ సహనటుడు ఎంపికయ్యారు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ కలిసి నిర్మించారు. ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
