
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో అంజలి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ వసంత బాలన్ దర్శకత్వం వహించిన ‘అంగడి తేరు’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంజలి. 2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని అప్పట్లో షాపింగ్ మాల్ పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్, అంజలి, వెంకటేశ్, పాండి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రనికి విజయ్ ఆంటోని, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. చెన్నైలోని టి-నగర్‌లోని బట్టల దుకాణాలలో పనిచేసే ఉద్యోగుల సమస్యల గురించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మహేష్, అంజలి, పాండి పాత్రలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. వారిలో నటి సుకున నాగరాజన్ ఒకరు.
సుకున నాగరాజన్.. షాపింగ్ మాల్ చిత్రంలో సోఫియా అనే పాత్రను పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాల్లో అంతగా కనిపించలేదు. సుకున షాపింగ్ మాల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజన్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఒక్క సినిమాతో ఫేమస్ అయిన సుకున ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇక ప్రస్తుతం సుకున బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు సుకున సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకున మాట్లాడుతూ.. ‘నాకు 8వ నెలలో అబార్షన్ జరిగింది. బిడ్డ కడుపులోనే చనిపోయింది. దాని నుండి కోలుకోవడంలో నా భర్త సహకరించాడు. తరువాత, నా కొడుకు జన్మించాడు. ‘ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. నల్లరంగులో ఉన్నందున తనను ఎంతో మంది అవమానించారని.. సినిమాల్లో రిజెక్ట్ చేశారని తెలిపింది. తనను ఎవరూ ప్రేమించలేరని.. తనతో ఎవరూ స్నేహం చేయరని తాను భావించానని.. కానీ ప్రేమ, పెళ్లి తర్వాత తన జీవితాన్ని భర్త పూర్తిగా మార్చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సుకున.. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
Suguna Nagarajan
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..