ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..? చాలా మంది ఫెవరేట్ హీరోయిన్ ఆమె

తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఈ అమ్మడినే హీరోయిన్ గా ఫిక్స్ చేసేవారు. అంత క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..? చాలా మంది ఫెవరేట్ హీరోయిన్ ఆమె
Actress
Follow us

|

Updated on: Apr 28, 2024 | 8:38 AM

సినీ ఇండస్ట్రీలో  స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది రీసెంట్ డేస్ లో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి ఆతర్వాత వరుస ఫ్లాప్స్ తో కనిపించకుండా పోయారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తున్నారు.. ఆ ముద్దుగుమ్మతో పైన కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఈ అమ్మడినే హీరోయిన్ గా ఫిక్స్ చేసేవారు. అంత క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కరాటే కిడ్ ఇప్పుడు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి.. ఆమె ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న కరాటే కిడ్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. 2010లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. తొలి సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించింది. తన అందంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది సమంత.

యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత అభిమానులకు షాక్ ఇస్తూ ఈ ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత సమంత సినిమాలతో బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే మైయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటుంది సామ్. సినిమాలకు ఒక ఏడాది పాటు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది సామ్. తెలుగు, తమిళ్ తో పాటు ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించి అక్కడి అభిమానులను కూడా ఆకట్టుకుంది సామ్. సెటాడియల్ అనే సినిమాలో నటిస్తుంది సామ్. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నేడు సామ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ చిన్నదానికి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

సమంత ఇన్ స్టా గ్రామ్..

సమంత ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles