Thalapathy vijay: దళపతి విజయ్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్.. ఇన్నాళ్ల తర్వాత ఇలా..

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నాడు.  ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు.

Thalapathy vijay: దళపతి విజయ్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్.. ఇన్నాళ్ల తర్వాత ఇలా..
Vijay
Follow us

|

Updated on: Apr 28, 2024 | 8:17 AM

దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు విజయ్. దాంతో కొందరు అభిమానులు షాక్ అవుతుంటే.. మరికొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నాడు.  ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో ఒకప్పటి మొద్దుగుమ్మలు కూడా కనిపించనున్నారని టాక్.  ప్రభుదేవా,ప్రశాంత్‌, వైభవ్‌, ప్రేమ్‌జీ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో స్నేహ, లైలా కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.

ఒకప్పుడు లైలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటుంది. వయసు పెరిగిన తరగని అందంతో షాక్ ఇస్తుంది. ఒకానొక సమయంలో కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ చిన్నది.  తెలుగు తమిళ్ , భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మొనీమధ్య కార్తీ హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు విజయ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది లైలా. వెంకట్‌ ప్రభు దర్శకత్వం తెరకెక్కుతోన్న గోట్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ రానున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ అట్లీ డైరెక్షన్ లో ఓ మూవీ అలాగే హెచ్‌ వినో ద్‌ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.