
మెగాస్టార్ చిరంజీవిని చూస్తే చాలు అనికునేవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన కలిసి పని చేస్తున్నారు. ఇంకొంతమంది ఆయనతో సినిమాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారిలో చాలా మందికి మెగాస్టార్ ఓ ఆదర్శం. ఆయనను స్పూర్తిగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు కూడా. ఇకపై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని చూశారా.? మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అతను చాలా ఫెమస్, దేశాన్ని ఊపేశాడు అతడు. మల్టీటాలెండ్ పర్సన్ అతను. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ గా మారాడు ఆయన. చిరంజీవి వీరాభిమాని. అన్నయ్యలానే ఇతరులకు సాయం చేయడంలో ముందుంటాడు అతను. ఇంతకూ ఆయన ఎవరో కాదు..
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో సన్సేషన్ క్రియేట్ చేసిన డాన్స్ మూమెంట్స్ లారెన్స్ ఖాతాలోవే.. అలాగే రీసెంట్ గా నటుడిగా జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారులకు, పేదలకు ఎంతో సాయం చేశాడు లారెన్స్. అలాగే తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించాడు లారెన్స్. అలాగే కొంతమంది ఆర్థిక సాయం కూడా చేశారు.
Happy Diwali everyone. May this year be filled with happiness, light and good health ✨ pic.twitter.com/40TFs42Rwr
— Raghava Lawrence (@offl_Lawrence) October 31, 2024
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి