అలా కాదురా పిచ్చోడా..!! రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే.. గుర్తుపట్టలేదా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో పెద్ది సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రచ్చ సినిమా ఒకటి.

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం అయ్యి ఆతర్వాత హీరోయిన్స్, హీరోలుగా మారిపోతున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా క్యూట్ గా కనిపించిన వారు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కల్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇలా ఇంకొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన.. రచ్చ సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా చిన్ననాటి పాత్రలో క్యూట్ గా నటించింది ఈ చిన్నారి.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు కూడా చేస్తోంది. తన పేరు విశికా కోటా. సగిలేటి కథ, ఏందిరా ఈ పంచాయితీ వంటి సినిమాల్లో ఈ బ్యూటీ తన నటన.. అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది. గతంలో విశికా కోటా పలు ఇంట్రస్టింగ్ విషయాలు అభిమానులతో పంచుకుంది. “రచ్చ మూవీ చిత్రీకరణ సమయంలో చరణ్, తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి షూటింగ్ అప్పుడు వాళ్లు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనమో.’’ అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ.
జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించిన ఈ తెలగమ్మాయి.. గ్రాడ్యుయేషన్ తర్వాత నటనవైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెన్స్ ఉంటే.. ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా నటిస్తున్న ఓదెల 2 ట్రైలర్ లాంచ్ లోనూ ఈ చిన్నది మెరిసింది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్. ఎప్పుడూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్.. త్వరలో ఈ అమ్మాయి టాప్ రేంజ్‌కి వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
విశికా కోటా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
విశికా కోటా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








