Niharika: ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సిస్టర్ గుర్తుందా? ఇప్పుడేలా మారిపోయిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ కు ఒక్కడు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రకాశ్‌ రాజ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ముఖేష్ రుషి, చంద్రమోహన్ లాంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు. ఇక ఇందులో 'ఒరేయ్‌ అన్నయ్యా..’ అంటూ మహేష్ ను ఆట పట్టించే ఆశ పాత్రలో ఒక అమ్మాయి అద్భుతంగా నటించింది.

Niharika: ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సిస్టర్ గుర్తుందా? ఇప్పుడేలా మారిపోయిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Niharika
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2024 | 5:34 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒక్కడు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భూమిక హీరోయిన్ గా నిలిచింది. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ కు ఒక్కడు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రకాశ్‌ రాజ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ముఖేష్ రుషి, చంద్రమోహన్ లాంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు. ఇక ఇందులో ‘ఒరేయ్‌ అన్నయ్యా..’ అంటూ మహేష్ ను ఆట పట్టించే ఆశ పాత్రలో ఒక అమ్మాయి అద్భుతంగా నటించింది. ఆమె పేరు బేబీ నిహారిక. ఒక్కడు సినిమాతో పలు చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది నిహారిక. యమజాతకుడు సినిమాలో మోహన్ బాబు మేనకోడలిగా నటించిన ఆమె వెంకటేష్ ప్రేమించుకుందాం రాలోనూ ఒక కీలక పాత్రలో మెరిసింది. అయితే ‘ఒక్కడు’ చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది నిహారిక. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే పూర్తి దృష్టి సారించింది. అన్నట్లు నిహారికకు పెళ్లి కూడా అయిపోయింది. ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో సుమారు 10 ఏళ్ల క్రితమే ఆమెకు వివాహమైంది. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు కూడా హాజరయ్యారు. ఇప్పుడు నిహారికకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది నిహారిక. కేవలం తన ఫ్యామిలీతోనే గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉన్నట్లు లేదు. అయితే రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైంది నిహారిక. మళ్లీ ఆ తర్వాత కూడా బయట ఎక్కడా కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు నెట్టింట నిహారిక ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. వీటిని చూసిన నెటిజన్లు హీరోయిన్ లా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే నటిగా మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చుగా అంటూ కోరుతున్నారు. మరి నిహారిక మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తుందో ? రాదో? రాబోయే రోజుల్లో తెలుస్తోంది.

భర్తతో నిహారిక..

Niharika Family

Niharika Family

ఇవి కూడా చదవండి

నిహారిక లేటెస్ట్ ఫొటోస్..

Niharika Photos

Niharika Photos

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..