Vishwak Sen: దసరా స్పెషల్.. సోదరితో కలిసి దాండియా ఆడిన టాలీవుడ్ హీరో.. వీడియో చూడండి

దేశమంతా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడా దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అలాగే పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దుర్గామాత మహిమలు, గొప్పతనం గురించి తెలిసేలా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకల్లో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాలు పంచుకుంటున్నారు

Vishwak Sen: దసరా స్పెషల్.. సోదరితో కలిసి దాండియా ఆడిన టాలీవుడ్ హీరో.. వీడియో చూడండి
Vishwak Sen
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2024 | 4:41 PM

దేశమంతా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడా దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అలాగే పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దుర్గామాత మహిమలు, గొప్పతనం గురించి తెలిసేలా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకల్లో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాలు పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ దసరా పండుగను పురస్కరించుకుని దాండియా ఆడుతూ కనిపించాడు. నవరాత్రుల సంద్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ తన సోదరితో కలిసి దాండియా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు హీరోకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విశ్వక్ సేన్. ఫిబ్రవరిలో విడుదలైన గామి సూపర్ హిట్ గా నిలిచింది. మేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ఊరమాస్ మూవీలో నటించాడు విశ్వక్ సేన్. ఇది కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం విశ్వక్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి . అందులో మెకానిక్ రాకీ ఒకటి. రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు లైలా అనే ఓ డిఫరెంట్ మూవీతో నటిస్తున్నాడు విశ్వక్. త్వరలోనే ఈ మూవీ అప్ డేట్స్ మన ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

సోదరితో దాండియా ఆడుతోన్న విశ్వక్ సేన్.. వీడియో ఇదిగో..

 వినాయక చవితి స్పెషల్.. ఇంట్లో మట్టి వినాయకుడిని తయారు చేస్తోన్న విశ్వక్ సేన్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Vishwak Sen (@vishwaksens) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!