AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Movie: అసలేం మారలేదు గురూ.. ‘గోదావరి’ మూవీ సెకండ్ హీరోయిన్‎ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది..

గోదావరి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ మూవీ సాంగ్స్ వినిపిస్తుంటాయి.

Godavari Movie: అసలేం మారలేదు గురూ.. 'గోదావరి' మూవీ సెకండ్ హీరోయిన్‎ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది..
Neethu Chandra
Rajitha Chanti
|

Updated on: Jan 14, 2025 | 12:54 PM

Share

సాధారణంగా సినీరంగంలో కొందరు ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే చాలా ఫేమస్ అయిపోతుంటారు. హీరోయిన్స్ గా కనిపించడం.. లేదా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఒకటి రెండు చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన చాలా మంది అమ్మాయి.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో నీతూ చంద్ర ఒకరు. ఈ పేరు జనాలకు అసలే తెలియదు. కానీ గోదావరి సినిమాలో సుమంత్ మరదలు అంటే మాత్రం తెలుగు అడియన్స్ ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో రాజీ పాత్రతో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి చిత్రం 2006 మే 19న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్ కూడా. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి. ఇందులో హీరోగా సుమంత్.. హీరోయిన్‏గా కమలినీ ముఖర్జీ నటించగా.. నీతు చంద్ర కీలకపాత్ర పోషించింది.

ఈ చిత్రంలో సుమంత్, కమలిని కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది నీతూ చంద్ర. 1984 జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2003లో విష్ణువు అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల్లో నటించిన నీతూ చంద్రకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ గోదావరి మూవీతో అట్రాక్ట్ చేసింది.

తెలుగులో నీతూకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించిన నీతూ 2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆమె కరాటేలో బ్లాక్ బెల్డ్. చిన్నప్పుడే కరాటే, తైక్వాండో వంటి పోరాట విద్యలు నేర్చుకుంది. 2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్ గా మారింది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీగా ఉంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..