Child Artist: సింహరాశి సినిమా చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా..? ఇప్పుడు తెలుగులో తోపు హీరో..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. మరీ మీకు ఈ చిన్నోడు గుర్తున్నాడా.. ?రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమాలో నటించిన ఈ చిన్నోడు ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నారు. తాజాగా అతడి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో తెలుసా..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోలలో రాజశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్రవేశారు. ఫ్యామిలీ అడియన్స్ ను ఆకట్టుకునేలా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో సింహరాశి ఒకటి. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా వచ్చి దాదాపు 24 ఏళ్లు అయినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మూవీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ది బెస్ట్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి వి.సముద్ర దర్శకత్వం వహించారు.
సింహరాశి తమిళ చిత్రానికి రీమేక్, తమిళంలో శరత్ కుమార్, మీనా నటించిన మాయి సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీతోనే హీరోగా తెరంగేట్రం చేశారు రాజశేఖర్. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం ఇది. ఇందులో సాక్షి శివానంద్ కథానాయికగా నటించగా.. రాజశేఖర్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన చిన్నోడు గుర్తున్నాడా.. ? కేవలం 4 ఏళ్ల వయసులోనే తన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. అతడి యాక్టింగ్ తో జనాలను ఏడిపించారు. ఆ చిన్నోడు ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?
ఆ కుర్రాడి పేరు మాస్టర్ మహేంద్రన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. సింహరాశి సినిమా తర్వాత దేవి సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, ఆహా, దేవి, అమ్మాయి కోసం, నీకోసం, సింహాద్రి ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన మహేంద్రన్.. ఇటీవల మాస్టర్ చిత్రంలో విజయ్ సేతుపతి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ పోషించారు. ప్రస్తుతం హీరోగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లవ్, అసలేం జరుగుతుందంటే వంటి సినిమాల్లో హీరోగా నటించారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పుడు హీరోగా ఎలాగైనా హిట్టుకొట్టేందుకు వెయిట్ చేస్తున్నారు మహేంద్రన్. తాజాగా ఈ కుర్రాడి సోషల్ మీడియా ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








