అందంతో మతిపోగొడుతున్న వయ్యారి దక్ష నగార్కర్.. 

Rajeev 

06 May  2026

instagram

'హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్. ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ వెంటనే జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది.

అలాగే కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.

ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న `రావణాసూర`లోనూ అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

ప్రస్తుతం ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. దాంతో సోషల్ మీడియాతో బిజీగా ఉంటుంది ఈ చిన్నది. 

 దక్షా నగార్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. 

తాజాగా ఈ అందాల భామ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.