Shriya Kontham: వచ్చేసిందిరోయ్.. టాలీవుడ్‌కు మరో హీరోయిన్.. గ్యాంగ్ లీడర్ బ్యూటీ సినిమా ఇదే..
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అందం, అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోయిన్ గా మారింది. తనే శ్రియా కొంతం. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో ప్రియాంక మోహనన్ కథానాయికగా నటించగా.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నానితోపాటు ఐదు జనరేషన్లకు సంబంధించిన మహిళలు కనిపించారు. అందులో టీనేజ్ అమ్మాయిగా.. నానిని అన్నయ్యా అని పిలుస్తూ కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? పైన ఫోటోలో కనిపిస్తుంది కదా. ఆ అమ్మాయి యాక్టింగ్ మీకు గుర్తుండే ఉంటుంది. కళ్లజోడు పెట్టుకుని పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. తనే శ్రియ కొంతం. గ్యాంగ్ లీడర్ సినిమాతో ఫేమస్ అయిన ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అరాచకం సృష్టించింది.
ఇక ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వెండితెరపై మరోసారి సినీప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా మారి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. అంకిత్ కొయ్య, శ్రియ కొంతం జంటగా నటిస్తున్న సినిమా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈరోజు దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








