Santhosham Movie : కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆధ్యాత్మిక సంస్థలో చేరి.. నాగార్జున సంతోషం హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అప్పట్లో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగులు వేసింది. ఇప్పుడు ఆమె లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

తెలుగు సినీరంగంలో నటిగా తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. నాగార్జున నటించిన సంతోషం సినిమా హీరోయిన్ గ్రేసీ సింగ్. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాగ్, గ్రేసీ సింగ్ జోడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సంతోషం తర్వాత అదే స్థాయిలో హిట్స్ మాత్రం అందుకోలేదు. మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించింది.
ఈ సినిమా తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. కానీ హిందీలో మాత్రం అనేక ఆఫర్స్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ కలిసి నటించిన లగాన్ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. గ్రేసీ సింగ్ క్లాసికల్ డ్యాన్సర్. లగాన్ సినిమాతోపాటు.. మున్నా భాయ్ MBBS, గంగాజల్ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేసిన గ్రేసీ సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. క్లాసికల్ డ్యాన్సర్‌గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన గ్రేసీ సింగ్.. 1997లో బుల్లితెరపై వచ్చిన అమానత్ లో నటించింది. పంజాబీ, తెలుగు, మలయాళ చిత్రాలతో సహా ప్రాంతీయ సినిమాల్లో నటించింది. 2008 తర్వాత ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి.
2013లో, గ్రేసీ బ్రహ్మ కుమారిస్ అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న గ్రేసీ సింగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా గ్రేసీ సింగ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..




