Daddy Movie: అసలేం మారలేదు గురూ.. డాడీ సినిమాలో చిరంజీవితో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఏం చేస్తుందంటే..
సినీరంగంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలాంటివారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.

సినీరంగంలో హీరోయిన్లుగా ఎదగాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. సవాళ్లు, విమర్శలు, అవమానాలను భరించి వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి రెండు చిత్రాలతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ డమ్ సంపాదించుకోవాల్సిన తారలు అనుహ్యంగా సినిమాలకు దూరమైపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం అదే జాబితాలోకి చెందినవారు. తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఆ మూవీలోని పాటలు సైతం శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుందా.. ? ఆమె పేరు ఆశిమా భల్లా. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ డాడీ మూవీ సెకండ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో చిరుతో కలిసి ‘పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ, పెడతా ఎంచక్కా ప్రేమ బువ్వనీ’ పాటకు స్టెప్పులేసింది. డాడీ సినిమాతో గ్లామర్ బ్యూటీగా అలరించింది. ఆ తర్వాత వేణు తొట్టెంపూడి నటించిన చెప్పవే చిరుగాలి చిత్రంలో నటించింది. ఇందులో చీరకట్టులో అమాయకమైన అమ్మాయిగా ఆకట్టుకుంది. తెలుగులో నాయుడు ఎల్ఎల్‌బిలో చివరిసారిగా కనిపించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ తర్వాత సన్నీ మీనన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. వీరికి పాప. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. గతంలో ఓ ప్రకటనలో కనిపించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..








