Manasantha Nuvve: ‘మనసంత నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..

ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ నటించింది. మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తూనీగ తూనీగ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు.

Manasantha Nuvve: 'మనసంత నువ్వే' చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..
Manasantha Nuvve
Follow us

|

Updated on: Sep 06, 2024 | 9:58 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమకథలలో మనసంత నువ్వే ఒకటి. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‏నే మలుపు తిప్పిన సినిమా ఇది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు మ్యూజికల్ సూపర్ హిట్. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ నటించింది. మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తూనీగ తూనీగ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలు కనిపిస్తాయి.

ముఖ్యంగా ఈ మూవీలో రీమా సేన్ చిన్ననాటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఓ చిన్నారి. తన పేరే సుహాని కలిత. బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. బాలనటిగా అలరించిన ఈ చిన్నారి.. ఆ తర్వాత కథానాయికగా కొన్ని సినిమాలు చేసింది. తెలుగుల శ్రీశైలం, స్నేహగీతం చిత్రాల్లో మెరిసింది. అయితే ఈ సినిమాలు థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో హీరోయిన్ గా సుహానికి కూడా అంతగా క్రేజ్ రాలేదు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదూ. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

ఉన్నత చదువులు పూర్తి చేసిన సుహాని ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది సుహాని. ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. ప్రస్తుతం సుహాని ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. బాలనటిగా అమాయకంగా కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు గ్లామర్ డోస్ తో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. తూనీగ చిన్నారి ఈ రేంజ్ లో మారిందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..