96 Movie: సూపర్ హిట్ ’96’ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..
ఇందులో త్రిష, విజయ్ సేతుపతి చిన్ననాటి పాత్రలలో నటించిన హీరోయిన్ గౌరీ జి. కిషన్, ఆదిత్య భాస్కర్ తమ నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ సినిమాలో జాను స్నేహితురాలు సుభాషిణి పాత్రలో నటించిన అమ్మాయి టాలీవుడ్ ప్రముఖ నటి కుమార్తె అని చాలా మందికి తెలియదు. ఆ అమ్మాయి ప్రముఖ నటి దేవదర్శిని కూతురు నియతి. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. సినిమాలో దేవదర్శిని, నియతి పాత్రలు 'పర్ఫెక్ట్ కాస్టింగ్' కావడంతో ఆ రోజు అందరి దృష్టిని ఆకర్షించింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రేమలోని మాధుర్యాన్ని, ఇష్టంతో కూడిన బాధను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో త్రిష, మక్కల్ సెల్వన్ మాత్రమే కాదు, వీరిద్దరి బాల్యాన్ని అడియన్స్ కు దగ్గరయ్యింది. ఈ సినిమాలోని త్రోబ్యాక్ పార్ట్ కు విశేష ఆదరణ లభించింది. ఇందులో త్రిష, విజయ్ సేతుపతి చిన్ననాటి పాత్రలలో నటించిన హీరోయిన్ గౌరీ జి. కిషన్, ఆదిత్య భాస్కర్ తమ నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ సినిమాలో జాను స్నేహితురాలు సుభాషిణి పాత్రలో నటించిన అమ్మాయి టాలీవుడ్ ప్రముఖ నటి కుమార్తె అని చాలా మందికి తెలియదు. ఆ అమ్మాయి ప్రముఖ నటి దేవదర్శిని కూతురు నియతి. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. సినిమాలో దేవదర్శిని, నియతి పాత్రలు ‘పర్ఫెక్ట్ కాస్టింగ్’ కావడంతో ఆ రోజు అందరి దృష్టిని ఆకర్షించింది.
జాను స్నేహితురాలు సుభాషిణిగా కనిపించిన నియతి మలయాళంలో తొలిసారిగా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ‘పతింతంపాడి’ తర్వాత, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ‘రాణి: ది రియల్ స్టోరీ’లో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా నియతి మలయాళంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు నియతి ‘పయి ఇరుక భయమేన్’ విడుదలై 1 వంటి చిత్రాలలో నటించింది.
View this post on Instagram
నియతి తల్లి దేవదర్శిని బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన చిత్రంతో పాపులారిటీని సంపాదించుకుంది. దేవదర్శిని ఉత్తమ హాస్యనటిగా తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర అవార్డును రెండుసార్లు అందుకుంది. ఇప్పుడు ఆమె కూతురు నియాతి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు కోసం కష్టపడుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




