
దక్షిణాదిలో 16 ఏళ్లకే చక్రం తిప్పిన హీరోయిన్ రంభ. చిన్న వయసులోనే నటిగా అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. 1992లో రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్టు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఏవండి ఆవిడ వచ్చింది, తొలి ముద్దు, రౌడీ అన్నయ్య, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, ఖైదీ ఇన్ స్పెక్టర్, హిట్లర్ వంటి చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అవకాశాలు అందుకుంది. అభినయం.. చూడచక్కని రూపంతో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కేవలం కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది. అల్లు అర్జున్, పూరి కాంబోలో వచ్చిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రంభ.. ఫ్యామిలీతోనే బిజీగా ఉండిపోయింది. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే రంభ పెద్ద కూతురు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అందంలో తల్లిని మించిన ఆ అమ్మాయి.. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు రంభ రియాక్ట్ కాలేదు.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
మరోవైపు ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సందడి చేసిన రంభ.. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు ఛానల్స్ షోలలో కనిపిస్తుంది. ఇటీవల తమిళంలో ఓ రియాల్టీలో జడ్జీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..