Tollywood: కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? ఇంతలా మారిపోయాడేంటీ.. ఇప్పుడేం చేస్తున్నాడంటే

|

Oct 05, 2024 | 11:47 AM

అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాలో హీరోకు ఫ్రెండ్‌గా నటించిన కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? తెలుగులో కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywood: కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? ఇంతలా మారిపోయాడేంటీ.. ఇప్పుడేం చేస్తున్నాడంటే
Babloo Comedian
Follow us on

అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాలో హీరోకు ఫ్రెండ్‌గా నటించిన కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? తెలుగులో కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి.. అనంతరం స్టార్ హీరోల చిత్రాల్లో వరుసపెట్టి ఛాన్స్‌లు దక్కించుకున్నాడు. 20వ దశకంలో మాంచి క్రేజ్ సంపాదించిన బబ్లూ అకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. మరి ఇంతకీ అతడు ఇప్పుడేం చేస్తున్నాడు.? ఎక్కడున్నాడో ఇప్పుడు తెలుసుకుందామా..

బబ్లూ అసలు పేరు సదానంద్. 5 ఏళ్ల వయసులో ‘ముద్దుల మేనల్లుడు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వరుసగా బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించాడు. ఇక ఉదయ్ కిరణ్ నటించిన ‘చిత్రం’ మూవీతో కమెడియన్‌గా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం హిట్ కావడంతో అతడి వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఇలా ఛాన్స్‌లు వస్తున్న తరుణంలో అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు బబ్లూ.. తన జీవితంలో ఎన్ని విషాదాలు నెలకొన్నాయని.. దాని వల్ల డిప్రెషన్‌కు లోనయ్యాయని ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

2012లో తండ్రి మరణం.. ఆ తర్వాత 2022లో చెల్లి చనిపోవడం.. ఆ మరుసటి ఏడాది జనవరిలో తన మేనత్త కొడుకు మరణించడంతో.. ఈ బాధల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. కొన్నేళ్లు బ్యాంకాక్ వెళ్లిపోయి.. అక్కడే డీజేగా పని చేశానని చెప్పాడు బబ్లూ. ప్రస్తుతం ఓ ఫిల్మ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానని.. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశాడు. అలాగే తాను కూడా సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నట్టు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి