Ammayilu Abbayilu Movie: అమ్మాయిలు అబ్బాయిలు మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేలా మారిపోయిందో చూశారా ?..
హీరోయిన్ డెబీనా బెనర్జీ. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ అమ్మాయిలు అబ్బాయిలు మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో మోహిత్, విజయ్ సాయి, డెబీనా ప్రధాన పాత్రలలో నటించగా.. సోనూ సూద్, రమ్య శ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం కీలకపాత్రలలో నటించారు.
సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. అయినా ఇప్పటికీ ఆ తారలకు అభిమానులు ఉన్నారు. అందులో హీరోయిన్ డెబీనా బెనర్జీ. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ అమ్మాయిలు అబ్బాయిలు మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో మోహిత్, విజయ్ సాయి, డెబీనా ప్రధాన పాత్రలలో నటించగా.. సోనూ సూద్, రమ్య శ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం కీలకపాత్రలలో నటించారు. ఇందులో డెబీనా కథానాయికగా నటించింది.
అందం, అమాయకత్వం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కలకత్తాలోని వెస్ట్ బెంగాల్ కు చెందిన డెబినా.. 2003లో ఇండియన్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో నటించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ సరసన ఓమూవీ చేసింది. అయితే ఈ హీరోయిన్ కు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కేవలం ఒకే ఒక్క చిత్రంలో నటించింది.
ఆ తర్వాత పదేళ్లకు జగపతి బాబు నటించిన సిక్స్ సినిమాలో కనిపించింది. తమిళ్, హిందీ టీవీ సీరియల్స్ చేసింది. 2011లో నటుడు గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ చేస్తోన్న డెబినా.. అటు ఫ్యామిలీతో సమయం గడుపుతుంది. డెబీనా ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫ్యామిలీ ఫోటోస్ నిత్యం షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.