Prabhas: పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు బుల్లితెరపై అలా..

విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో కనిపించింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపించింది.

Prabhas: పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు బుల్లితెరపై అలా..
Prabas
Follow us

|

Updated on: Oct 13, 2024 | 3:00 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే అడియన్స్ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే డార్లింగ్ వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ సరసన మరోసారి త్రిష కథానాయికగా నటించగా.. హీరోయిన్ ఛార్మీ కూడా డార్లింగ్ తో జతకట్టింది. ఇందులో ప్రభాస్, ఛార్మి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ సింధు తులానీ కీలకపాత్ర పోషించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్స్. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తనే మధు శర్మ. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు . కానీ ఇందులో ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహని పాత్రలో నటించి అలరించింది మధు శర్మ.

మధు శర్మ… ముంబైకి చెందిన ముద్దుగుమ్మ. పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో అలరించింది. ఈ బ్యూటీ అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించింది. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో కనిపించింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపించింది.

ఈ సినిమా తర్వాత తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మా వంటి చిత్రాల్లో నటించింది. వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటించిన మధుశర్మ ఆ తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేసిన మధుశర్మ భోజ్ పురిలో సినిమాల్లో నటిస్తుంది. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన మధు శర్మ ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మధుశర్మ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Madhhu Shharma (@madhhuis)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..