పట్టువదలని విక్రమార్కుడు..! 34 సినిమాలు చేస్తే 24 డిజాస్టర్స్.. ఈ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..
టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ పేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ అందుకోలేకపోతున్నారు. ఈ టాలీవుడ్ హీరో కూడా ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు, హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ.. 34 సినిమాలు చేస్తే 24 ఫ్లాప్స్ అందుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలదే హవ. కొత్త కొత్త కథలతో, సినిమాలతో హిట్స్ అందుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఈ హీరో ఒకడు. ఈ యంగ్ హీరోకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. కానీ హిట్స్ మాత్రం లేవు.. సినిమాల్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ.. 34 సినిమాలు చేస్తే 24 సినిమాలు ఫ్లాపులు. అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. ఈసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఇది కూడా చదవండి : ఈయన ఆయనేనా..! ఏంటీ.. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!! గుర్తుపట్టారా మావ
ఇంతకూ ఆహీరో ఎవరో కాదు టాలీవుడ్ కుర్ర హీరో నితిన్. జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆతర్వాత దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కానీ నితిన్ ఖాతాలో హిట్స్ మాత్రం పడలేదు. అప్పట్లో నితిన్ వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు.
ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు
ఇష్క్ తర్వాత, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఆ మధ్య వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ అయ్యింది. ఆతర్వాత యధావిధిగా వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. రీసెంట్ డేస్ లో నితిన్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం , రాబిన్ హుడ్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా తమ్ముడు సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పటివరకు నితిన్ 34 సినిమాలు చేస్తే అందులో 24 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో రానున్నాడు నితిన్. వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








