AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పార్ట్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. నాకు ఇష్టం లేదని చెప్పా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనిపించకుండా మాయం అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో ఈ ముద్దుగుమ్మ. ఒకరు తన నటనతో అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె తన అందంతో ఎంతో మంది సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ పార్ట్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. నాకు ఇష్టం లేదని చెప్పా.. టాలీవుడ్ హీరోయిన్  కామెంట్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 16, 2025 | 1:04 PM

Share

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కొంతమంది అందం కోసం సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. తరగని అందం కోసం కొంతమంది భామలు లేనిపోని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అలాగే మరికొంతమంది మాత్రం బాడీలో కొన్ని పార్ట్స్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది పెదవులు, మరికొంతమంది నడుము ఇలా బాడీలో కొన్ని పార్ట్స్ కు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ను కూడా బాడీలో ఓ పార్ట్ ను సర్జరీ చేయించుకోమని ఫోర్స్ చేశారట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఈయన ఆయనేనా..! ఏంటీ.. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!! గుర్తుపట్టారా మావ

ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్స్ లో సమీరా రెడ్డి ఒకరు. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమీరా రెడ్డి పుట్టింది ముంబై లో ఆమె తండ్రి తెలుగువాడు, తల్లి మహారాష్ట్ర. కాగా మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో నటించింది. ఈ సినిమాతో సమీరా రెడ్డి మంచు గుర్తింపు వచ్చింది. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమా చేసింది. ఆతర్వాత చాలా కాలం తర్వాత రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కాగా ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో ఎక్కువాగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు

తమిళ్ లో సమీరా రెడ్డి నటించిన సూర్య సన్నాఫ్ కిషన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయిన సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే గతంలో సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సమీరా రెడ్డి శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయట. ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని ఎమోషనల్ అయ్యింది.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!

హీరోయిన్ గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు. నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా వినేవారు కాదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది సమీరా రెడ్డి. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది సమీర రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us