AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన లిప్ లాక్..! ఒక్క కిస్‌కు కోటిరూపాయలు అందుకున్న బ్యూటీ.. కానీ ఆతర్వాత

రొమాంటిక్ సీన్స్, లిప్ లక్స్ లేకుండా ఈ మధ్య కాలంలో సినిమాలు రావడం లేదు.. అలాగే హీరోయిన్స్ కూడా రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు. అలాగే సినిమాకు హీరోయిన్స్ కు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ కోసం ఏకంగా కోటి రూపాయిలు అందుకుందట..

ఖరీదైన లిప్ లాక్..! ఒక్క కిస్‌కు కోటిరూపాయలు అందుకున్న బ్యూటీ.. కానీ ఆతర్వాత
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 11:07 AM

Share

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఒకప్పుడు సినిమాలో రొమాంటిక్ సీన్స్ కనిపిస్తే ఎబ్బెట్టుగా అనిపించేవి కానీ ఇప్పుడు సినిమాలో అవి తప్పని సరిగా ఉంటున్నాయి. ఏ కంటెంట్ సినిమా అయినా సరే లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి.. అయితే ఓ హీరోయిన్ లిప్ లాక్ సిన్ కోసం ఏకంగా కోటిరూపాయలు అందుకుందట. ఒక్క కిస్ సీన్ కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయిలు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. అప్పటిలో ఆ వార్త పెద్ద చర్చమశనీయం అయ్యింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఎందుకు ఆమెకు కోటి రూపాయిలు ఆఫర్ చేశారు అనేది చూద్దాం.!

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్లుగా కొనసాగినవారిలో మాధురీ దీక్షిత్ ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మను దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మాధురీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె ఓ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ ఖరీదు గురించి నెట్టింట చర్చ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

1988లో థియేటర్లలో సూపర్ హిట్ అయిన దయావన్ సినిమాలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఇందులో హీరోహీరోయిన్లు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద రచ్చ చేసింది. ఎందుకంటే అప్పటికే మాధురీ స్టార్ హీరోయిన్ కూడా. అలాంటి అగ్ర కథానాయిక ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో దీని పై స్పందించిన మాధురీ ఆసక్తికర వియాలను పంచుకున్నారు. “నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ముఖ్యమైనది కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది. ” అని చెప్పుకుకొచ్చారు. ఈ సినిమాలో నటించేందుకు మాధురీ దీక్షిత్ భారీ మొత్తంలో అప్పట్లోనే కోటి రూపాయాల రెమ్యునరేషన్ ఇచ్చారని.. అందుకే ఆమె నో చెప్పలేకపోయిందని టాక్ వినిపించింది. ఈ సన్నివేశంతోపాటు.. లిప్ లాక్ చేసినందుకు ఆమెకు అప్పట్లోనే కోటి రూపాయాలు ఇచ్చారని సమాచారం. అప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇకపై కిస్ సీన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట.

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.