AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు.. 9 సినిమాలు చేస్తే 4 హిట్స్.. మిగిలినవన్నీ డిజాస్టర్స్

ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దాంతో వరుసగా ఆఫర్స్ అందుకుంది. కట్ చేస్తే వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతుంది.. దాంతో తమిళ్, మలయాళ సినిమాల వైపు అడుగులేసింది..

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు.. 9 సినిమాలు చేస్తే 4 హిట్స్.. మిగిలినవన్నీ డిజాస్టర్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 12:00 PM

Share

చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు. ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో, హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఓ చిన్నది ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు అదే హీరో సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఎవరో తెలుసా.?

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో ఇలా కనిపించి అలా వెళ్తుంది కృతిశెట్టి.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా చేస్తుంది. వా వాతియార్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. నలన్ కుమారసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే జయం రవితో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.