గుడ్డిగా నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి.. మతం మారాలని రోజూ నరకం చూపిస్తున్న భర్త
సినిమా హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా ముద్దుగుమ్మలే కాదు సీరియల్, టీవీ షోల్లో అలరించే అందాల భామలు కూడా తమ అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ బ్యూటీస్ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమకోసం, పెళ్లి కోసం మతం మార్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే బ్యూటీ కూడా పెళ్లి కోసం మతం మార్చుకుంది.. కానీ పెళ్లి తర్వాత భర్త చిత్ర హింసలు పెట్టడంతో ఆమె జీవితం దుర్భరంగా మారిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆతర్వాత భర్త తనను ముస్లిం మతంలోకి మారిపోమని బలవంతపెట్టాడని ఆరోపించింది. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని, హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. ఇంతకూ ఆమె ఈవారంటే..
సీరియల్ నటి ప్రీతీ తల్రేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ దాసి అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఈ బ్యూటీ అభిజీత్ పెట్కర్ అనే వ్యక్తిని ప్రేమించింది. దాదాపు మూడేళ్లు రిలేషన్ లో ఉన్న తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అభిజీత్ పెట్కర్ పేరు హిందూ అనుకుంది ప్రీతీ. రిలేషన్ లో ఉన్నప్పుడు అతను తన ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. ఆమె గుడ్డిగా అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అసలు విషయం బయట పడింది.
పెళ్లి తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని తనను ఒత్తిడి చేశాడని తెలిపింది. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను విపరీతంగా కొట్టేవాడు అని తెలిపింది. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయిందట. చివరకు చావు అంచులవరకు వెళ్లివచ్చిందట..ప్రీతీ తల్రేజా సోషల్ మీడియాలో తన భర్త గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను పెట్టే చిత్రహింసల గురించి వివరిస్తూ.. తనకు న్యాయం చేయమని అధికారులను కోరింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కు (PMO), థానే పోలీసులకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి మారి భర్త వేధింపుల గురించి వివరించింది.

Actress Preity Talreja