- Telugu News Photo Gallery Cinema photos Jabardasth varsha interesting comments about love and marriage
ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.. జీవితంలో పెళ్లి చేసుకోను.. షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ వర్ష
పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజలకు దగ్గరైంది వర్ష. ఆ త్రవాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇదే షోలో ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ టవ్ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయ్యింది ఈ అందాల భామ. జబర్దస్త్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.
Updated on: Jun 18, 2025 | 1:42 PM

పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజలకు దగ్గరైంది వర్ష. ఆ త్రవాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇదే షోలో ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ టవ్ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయ్యింది ఈ అందాల భామ.

అలాగే ఈ కామెడీ షోతోపాటు బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ అమ్మడు. అయితే కొన్ని రోజులుగా వర్ష నెట్టింట.. అటు కామెడీ షోలో సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే సీరియల్స్ నుంచి తప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టీవీ షోలు, జబర్దస్త్ మాత్రమే చేస్తుంది ఈ అందాల భామ. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకుంటావా.? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.? అని అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. అయితే తాను జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పి షాక్ ఇచ్చింది ఈ వయ్యారి భామ. అంతే కాదు తనకు పెళ్లి, ప్రేమల పై నమ్మకం లేదు అని తెలిపింది ఈ క్రేజీ బ్యూటీ.

నాకు ప్రేమ, పెళ్లిపై నాకు మంచి ఒపీనియన్ లేదు. లవ్, బ్రేకప్, హార్ట్ బ్రేక్, మళ్ళీ లవ్ లో పడటం ఇలాంటివన్నీ నాకు వద్దు అని తెలిపింది. ఒకప్పుడు నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఇప్పుడు లేడు.. నాకు అవసరం కూడా లేదు.. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. వాళ్ళకోసమే బతుకుతా అని చెప్పుకొచ్చింది వర్ష. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..



















