Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.! ఒకప్పుడు సింపుల్ బ్యూటీ.. ఇప్పుడు హాట్‌నెస్‌కు హీట్ పుట్టించేలా..

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ సినిమా నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలు. తెలుగు, హిందీ భాషా చిత్రాలలో, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత హిందీలోకి అడుగుపెట్టింది. అప్పుడు యావరేజ్ గా ఉన్న బ్యూటీ.. ఇప్పుడు కేక పెట్టించే లుక్ లోకి మారిపోయింది.

అమ్మబాబోయ్.! ఒకప్పుడు సింపుల్ బ్యూటీ.. ఇప్పుడు హాట్‌నెస్‌కు హీట్ పుట్టించేలా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 12:22 PM

Share

చాలా మంది హీరోయిన్స్ తొలి సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయి షాక్ ఇస్తున్నారు. ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు మరింత అందంగా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫోటో చూసి నెటిజన్స్ అవాక్ అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఇప్పుడు అభిమానులను షాక్ కు గురిచేస్తుంది. కొంతమంది ఇప్పటికీ ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి నమ్మలేకపొతున్నారు. ఇంతకూ ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా మారింది.? తెలుగులో ఏ సినిమాలో ఆమె కనిపించింది.?

తెలుగులో ఎన్నో సినిమాలు సైలెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాల్లో స్నేహగీతం సినిమా ఒకటి. ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతోనే నటుడు సందీప్ కిషన్ హీరోగా పరిచయం అయ్యాడు. సుందీప్ కిషన్, సుహాని కలిత, చైతన్య కృష్ణ, రియా, వెంకీ అట్లూరి, ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అందాల భామ శ్రేయా ధన్వంథరి.

ఇవి కూడా చదవండి

హైదరాబాదులోని తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రేయా ధన్వంతరి, ఢిల్లీ నగరంలో పెరిగింది. వరంగల్లులోని నిట్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసింది. స్నేహగీతం సినిమా కంటే ముందు ఈ అమ్మడు జోష్ సినిమాలో నటించింది. ఆతర్వాత ఈ అమ్మడు తెలుగులో నటించలేదు. బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. స్కామ్ 1992 తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. జోష్, స్నేహగీతం సినిమాలో పద్దతిగా కనిపించిన ఆమె ఇప్పుడు హీటు పెంచే హాట్ బ్యూటీగా మారిపోయింది. ఆమె ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.