AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌గా ఎంట్రీ.. గుర్తింపు రాకపోవడంతో చిన్నవయసులోనే తల్లి పాత్రలు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలోనై సహజ నటనతో మెప్పి్స్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎంతో మంది హీరోలకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి అలరించింది. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

హీరోయిన్‌గా ఎంట్రీ.. గుర్తింపు రాకపోవడంతో చిన్నవయసులోనే తల్లి పాత్రలు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
Tollywood News
Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 12:36 PM

Share
ఆమె తోపు నటి. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు ఆమె. చాలా సినిమాల్లో తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎంతో మంది హీరోలకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి అలరించింది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె అంతగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. చిన్న వయసులో హీరో తల్లిపాత్రలు చేసింది. ఆ పాత్రలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కట్ చేస్తే 100కు పైగా తెలుగు సినిమాలతో పాటు 23 తమిళ, 2 మలయాళం సినిమాల్లో నటించి.. ఇప్పటికీ నటిస్తూ మెప్పిస్తుంది. ఇంతకూ ఆ స్టార్ నటి ఎవరో తెలుసా.? సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో నటి ప్రగతి ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె.
విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సీనియర్ నటి. ప్రగతి ఎక్కువగా సహాయ పాత్రలలో నటించారు.  ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ప్రగతి కేవలం నటి మాత్రమే కాదు. 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించారు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించారు ప్రగతి. చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ ప్రకటనల్లో నటించడం ద్వారా గుర్తింపు పొందారు. ఈ ప్రకటనలను చూసిన తమిళ దర్శకుడు కె. భాగ్యరాజ్ ఆమెకు తన సినిమా వీట్ల విశేషంగా (1994)లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే, హీరోయిన్‌గా ఆమె పెద్దగా విజయం సాధించలేదు. ఆతర్వాత పెళ్లి చేసుకోవడంతో  కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన ప్రగతి, 2002లో మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె హీరోలు, హీరోయిన్లకు తల్లి, అత్త, అక్క వంటి సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. చిన్న వయసు (30 ఏళ్లలోపు)లోనే తల్లి పాత్రలు పోషించారు ప్రగతి. ప్రగతి 100కు పైగా తెలుగు సినిమాలతో పాటు 23 తమిళ, 2 మలయాళం సినిమాల్లో, అలాగే పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఎఫ్2, ఎఫ్3, బాద్‌షా, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో ఆమె నటన, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.