ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఒక్క ఎఫైర్‌తో కెరీర్ క్లోజ్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా..
హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఒకొక్కరూ ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారల కారణంగా వార్తల్లో నిలిచారు. ఎంతో మంది ప్రేమ , బ్రేకప్, రిలేషన్స్, డేటింగ్స్ ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వార్తల్లో నిలిచారు.

చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు.. కొంతమంది మాత్రం అవకాశాలు అందుకోవడంలో వెనకబడుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం తమ చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. పెళ్లైన హీరోలతో ఎఫైర్ పెట్టుకొని కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ ఉన్నారు. అలాగే మరికొంతమంది వివాదాల కారణంగా కెరీర్ వదిలిపెట్టిన వారు కూడా ఉన్నారు. ఓ హీరోయిన్ మాత్రం మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అది కూడా టాలీవుడ్ సినిమా.. తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమా పెద్ద విజయం సాధించింది. దాంతో ఈ భామ క్రేజ్ పెరిగిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులర్ అయ్యింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఎవరో కాదు మందాకినీ. ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపుఊపేసింది. తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది మందాకినీ.. ఆ సినిమానే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది మందాకినీ. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
ఈ బాలీవుడ్ బ్యూటీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో మందాకినీకి ఎఫైర్ ఉందని గతంలో వచ్చిన వార్తలు అప్పట్లో పెద్ద రచ్చ చేశాయి. ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే వార్తలు వినిపించాయి. ఓ క్రికెట్ మ్యాచ్ లో ఆమె దావుద్ పక్కన కూర్చున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె కెరీర్ పై పెద్ద దెబ్బ పడింది. దావుద్ తో ఆమెకు ఎఫైర్ ఉంది అంటూ వార్తలు రావడంతో నిర్మాతలు ఈ అమ్మడిని సినిమాల్లోకి తీసుకోవడానికి వెనకడుగేశారు. ఈ ఇద్దరికి పెళ్లయిందని ఓ బాబు కూడా ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని ఆమె ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆమె కెరీర్ మాత్రం నాశనం అయ్యింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. అలాగే ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది మందాకినీ.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
