AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ పండ్ల చెట్లు పెంచితే ఐశ్వర్యం.. ఈ చెట్లను మాత్రం దూరంగా ఉంచాలని వాస్తు సూచన!

Fruit Trees Vastu: ఇంటి ఆవరణలో ఏ పండ్ల చెట్లు పెంచితే శుభం కలుగుతుందో, ఏ చెట్లను నాటకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుందో తెలుసుకోండి. అలాగే పండ్ల చెట్లను ఏ దిశలో నాటితే సానుకూల శక్తి, ఐశ్వర్యం కలుగుతుందని వాస్తు నిపుణులు చెప్పే సూచనలను ఈ కథనంలో చదవండి.

Vastu Tips: ఇంట్లో ఈ పండ్ల చెట్లు పెంచితే ఐశ్వర్యం.. ఈ చెట్లను మాత్రం దూరంగా ఉంచాలని వాస్తు సూచన!
Fruit Trees Vastu
Rajashekher G
|

Updated on: Jul 24, 2026 | 4:49 PM

Share

Fruit Trees Vastu Telugu: ఇంటి ఆవరణలో పచ్చదనం ఉంటే ఆ ఇంటికి ప్రత్యేకమైన అందం వస్తుంది. అంతేకాదు, చెట్లుపరిసరాలను చల్లగా ఉంచడమే కాకుండా స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ముఖ్యంగా పండ్ల చెట్లు ఉంటే ఇంట్లోనే తాజా పండ్లను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో ఏ చెట్టు పడితే ఆ చెట్టును నాటడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పండ్ల చెట్లు శుభప్రదమైనవిగా భావించబడితే, మరికొన్ని చెట్లు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని విశ్వసిస్తారు. అలాగే చెట్లను నాటే దిశ కూడా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం ఇంట్లో పెంచడానికి అనుకూలమైన పండ్ల చెట్లు

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని పండ్ల చెట్లు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, కుటుంబానికి శ్రేయస్సును తీసుకువస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ చెట్లను శుభప్రదమైనవిగా భావిస్తారు.

  • ఉసిరి చెట్టు
  • జామ చెట్టు
  • దానిమ్మ చెట్టు
  • బొప్పాయి చెట్టు
  • అరటి చెట్టు
  • కొబ్బరి చెట్టు
  • నారింజ చెట్టు
  • కివి మొక్క

ఈ చెట్లు ఇంటి పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా, ఆరోగ్యానికి ఉపయోగపడే తాజా పండ్లను కూడా అందిస్తాయి. వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఈ పండ్ల చెట్లను నాటకపోవడం మంచిదని వాస్తు సూచన

వాస్తు శాస్త్రంలో కొన్ని పండ్ల చెట్లను ఇంటి ఆవరణలో నాటకూడదని పేర్కొంటారు. ముఖ్యంగా ముళ్లు ఎక్కువగా ఉండే లేదా ప్రతికూల శక్తిని సూచించే చెట్లను నివారించాలని సూచిస్తారు. వాటిలో ప్రధానంగా:

  • రేగు చెట్టు
  • ఖర్జూరం చెట్టు
  • పైనాపిల్ మొక్క

వాస్తు నమ్మకాల ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో అశాంతి, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశాన్ని సూచిస్తాయని చెబుతారు. అయితే, ఈ అభిప్రాయాలు వాస్తు విశ్వాసాల ఆధారంగా ఉన్నవే.

పండ్ల చెట్లు ఏ దిశలో నాటాలి?

చాలామంది ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలను పాటిస్తారు. కానీ ఇంటి ఆవరణలో చెట్లను నాటేటప్పుడు దిశలను పెద్దగా పట్టించుకోరు. వాస్తు ప్రకారం ఇది కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తారు. పండ్ల చెట్లను నాటడానికి అనుకూలమైన దిశలు: తూర్పు దిశ, ఈశాన్య దిశ.. ఈ దిశల్లో పండ్ల చెట్లను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని, కుటుంబ సభ్యులకు ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పండ్ల చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు

వాస్తు పరంగా మాత్రమే కాకుండా, పండ్ల చెట్లు పర్యావరణ పరంగానూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

  • ఇంటి చుట్టూ చల్లని వాతావరణం ఏర్పడుతుంది.
  • స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
  • ఇంట్లోనే సహజసిద్ధమైన తాజా పండ్లు అందుబాటులో ఉంటాయి.
  • పచ్చదనం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
  • కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.

(Disclaimer: వాస్తు శాస్త్రానికి సంబంధించిన సూచనలు సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. కాబట్టి వీటిని వ్యక్తిగత విశ్వాసంగా మాత్రమే పరిగణించాలి. పండ్ల చెట్ల ఎంపికలో వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న స్థలం, చెట్ల పెరుగుదల, నిర్వహణ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.)

Follow Us