AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : రెండుసార్లు బిగ్ బాస్ వెళ్లా.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.. ఇక చస్తే వెళ్లను.. టాలీవుడ్ నటి..

ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ షో సందడి మొదలైంది. త్వరలోనే అగ్ని పరీక్ష షో సైతం స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ పేరు నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ నటి మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి. బిగ్ బాస్ 8 తర్వాత తనకెదురైన మానసిక సంఘర్షణ, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు. తప్పుడు వార్తలు, ఫేక్ అకౌంట్ల వల్ల చాలా నష్టం జరిగిందని పేర్కొంటూ, ఆ విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని ఎలా తిరిగి వచ్చారో వివరించారు.

Bigg Boss : రెండుసార్లు బిగ్ బాస్ వెళ్లా.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.. ఇక చస్తే వెళ్లను.. టాలీవుడ్ నటి..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2026 | 1:48 PM

Share

నటి హరితేజ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులపై ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ప్రయాణం ఎలా మొదలైంది, కాస్ట్లీ పనిమనిషి అనే ముద్ర ఎలా పడింది, ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, డిప్రెషన్ వంటి విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ సంభాషణలో ఆమె సినీ రంగంలో ఎదురైన టైప్‌కాస్టింగ్, రెమ్యూనరేషన్ పుకార్లు, సోషల్ మీడియా ప్రభావం గురించి వివరంగా పంచుకున్నారు. హరితేజ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన టైప్‌కాస్టింగ్ సమస్య గురించి మొదట ప్రస్తావించారు. అ..ఆ వంటి పెద్ద సినిమా తర్వాత కూడా తనకెక్కువగా పనిమనిషి పాత్రలే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడి సినిమాలో నటించిన తర్వాత తన జీవితం మారుతుందని ఆశించినా, అదే విధమైన పాత్రలు వరుసగా రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. “పనిమనిషి క్యారెక్టర్లే వస్తున్నాయి అండి వరుస పెట్టి,” అని ఆమె చమత్కరించారు. తన పనిమనిషి పాత్రలు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ లేదా ఫన్ ఓరియెంటెడ్ అయితేనే నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చారని వివరించారు. తన మేనేజర్లు కూడా “మీకు కాస్ట్లీ పనిమనిషి కావాలంటే మన హరితేజ గారు ఉన్నారండి” అని చెప్పేవారని పేర్కొన్నారు.

హరితేజ జీవితంలో బిగ్ బాస్ సీజన్ 8 ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. ఈ షో తర్వాత తనకెంతో నష్టం జరిగిందని ఆమె వెల్లడించారు. ఇంట్లో ఉన్నప్పుడు అంత డామేజ్ అవుతుందని తనకు తెలియదని, కేవలం తన ప్రదర్శన పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని మాత్రమే భావించానని తెలిపారు. షో నుంచి బయటికొచ్చిన తర్వాత తనపై వచ్చిన ద్వేషం, విమర్శలు చూసి చాలా రోజులు డిస్టర్బ్ అయ్యానని చెప్పారు. ఎప్పుడూ తనను తమ పిల్లలాగా చూసుకున్న ప్రేక్షకులు ఒక్కసారిగా “షి ఈజ్ నాట్ ఎనర్జిటిక్ ఎనీమోర్,” “వెళ్లకుండా ఉండాల్సింది” అని విమర్శించడంతో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయారు. “నువ్వు నాకు ఒక స్టాంప్ వేసేసావ్ దట్ నేను ఇంకేం కాదు. ఐ యామ్ ఓవర్ అని నువ్వు నాకు చెప్పేసరికి ఐ కుడన్ట్ టేక్ ఇట్,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమ తన శక్తి అని, వారి ద్వేషం తనను నిరుత్సాహపరుస్తుందని ఆమె తెలిపారు.

ఈ సంఘటనల వల్ల తాను తీవ్రంగా ఆత్మవిశ్వాసం కోల్పోయానని, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని హరితేజ పేర్కొన్నారు. “ఇంత స్ట్రాంగ్ గా ఉండే హరితేజ, ఫటాఫట్ ఉండే హరితేజ కూడా డిప్రెషన్ కి వెళ్లిందా?” అని ప్రశ్నిస్తూ, తాను నిజంగానే డిప్రెషన్‌కు గురయ్యానని అంగీకరించారు. తాను చేయని తప్పుకు, తనకు సంబంధం లేని విషయానికి ప్రపంచం మొత్తం తనను అన్‌ఫిట్ అని మాట్లాడితే ఎవరైనా తట్టుకోవడం కష్టం అని ఆమె అభిప్రాయపడ్డారు. చాలావరకు నెగెటివిటీ ఫేక్ అకౌంట్స్ నుంచి, ఇతర పోటీదారుల పీఆర్ టీమ్‌ల నుంచే వచ్చిందని లోతైన విచారణలో తేలిందని ఆమె వెల్లడించారు. ప్రేక్షకులు నేరుగా పెట్టినవి కేవలం 10 శాతం మాత్రమే అయితే, 90 శాతం ఇతరుల ప్రచారం అని ఆమె వివరించారు. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత, దీన్ని రిపేర్ చేయడం తనవల్ల కాదని గ్రహించి, దానిని విస్మరించడం ఉత్తమమని నిర్ణయించుకున్నానని హరితేజ తెలిపారు. కొంత సమయం తీసుకున్నా, తాను తిరిగి సాధారణ స్థితికి వచ్చానని, బౌన్స్ బ్యాక్ అయ్యాయని ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

హరితేజ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us