మెగా హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా.. చిరు, పవన్, చరణ్‌లతో సినిమాలు చేశారు

మెగా హీరోలు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. బిజీగా మారారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మెగా హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా.. చిరు, పవన్, చరణ్‌లతో సినిమాలు చేశారు
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 02, 2025 | 11:57 AM

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోలుగా రాణిస్తున్నారు మెగా హీరోలు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కాకుండా తమ ప్రతిభతో దూసుకుపోతున్నారు. తమ సినిమాతో వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. అంతే కాదు సపరేట్ ఫ్యాన్ బేస్‌తో రాణిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు అని లిస్ట్ తీస్తే ఈ ముగ్గురు మెగా హీరోలు ఖచ్చితంగా ఉంటారు. ఆ ముగ్గురే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. చిరంజీవి, చరణ్ సినిమాలతో రాణిస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోలతో కలిసి నటించిన హీరోయిన్స్ ఎవరో తెలుసా.? ఈ మెగా హీరోలతో ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి నటించారు ఆ భామలు ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే తమకంటే ఏజ్ ఎలా పెద్ద హీరోతో సినిమాలు చేసిన ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో కలిసి నటించిన హీరోయిన్స్ ఎవరంటే.. ఆ ముద్దుగుమ్మల్లో ఒకరు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది. ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఆచి తూచి సినిమాలు చేస్తోంది కాజల్.

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. అలాగే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో మెరిసింది ఈ అమ్మడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేసింది. ఇక చరణ్ తో బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమా చేసింది. అలాగే నాయక్, ఎవడు సినిమాల్లో ఆడిపాడింది ఈ అమ్మడు. ఆలాగే  మెగా హీరోలతో కలిసి నటించిన మరో ముద్దుగుమ్మ శ్రుతిహాసన్. శ్రుతి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ సినిమాల్లో నటించింది. అలాగే చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసింది. ఇక చరణ్ తో ఎవడు సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇలా ఈ ఇద్దరు భామలు మెగా హీరోలతో ఆడిపాడింది.

శ్రుతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్  ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి