Chiranjeevi: మరోసారి ఆ స్టార్ దర్శకుడితో చిరంజీవి.. ఫ్యాన్స్‌కు పూనకాలే
యంగ్ జనరేషన్‌తో పోటి పడాలంటే ఆ వేవ్ లెంగ్త్‌ను మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు చిరు. ఆల్రెడీ ఎనౌన్స్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న సినిమాలు కూడా మెగా లైనప్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చిరంజీవి నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరచడంతో అభిమానులంతా ఇప్పుడు విశ్వంభర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఆయన కెరీర్ లోనే బిగెస్ట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆతర్వాత ఇప్పుడు వశిష్ఠ మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను కూడా లైనప్ చేశారని తెలుస్తుంది. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుందని అంటున్నారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అనిల్. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇదిలా ఉంటేఇప్పుడు అనిల్ చిరంజీవితో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.
కాగా ఈ సినిమా తర్వాత మరో యంగ్ డైరెక్టర్ ను కూడా లైనప్ చేశారని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు బాబీ. బాబీ కూడా రీసెంట్ గా బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలైంది. గతంలో చిరంజీవి, బాబీ కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి మంచి హిట్ అందుకున్నారు. ఇక తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మరోసారి సినిమా చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి