21ఏళ్లు ఉత్తమ నటుడు.. 41మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో..
తెలుగులో తోప్ హీరో.. 200లకు పైగా సినిమాలు.. పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్న నటుడు ఆయన. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు సహాయక పాత్రల్లో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అలాగే ఆయన ఇండస్ట్రీకి ఏకంగా 41మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి అద్భుతమైన సినిమాలు చేశారు. 200కు పైగా సినిమాలు చేసి చరిత్ర సృష్టించారు. అప్పటిలో ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కు క్యూ కట్టేవారు ఆడియన్స్. ఆయన సినిమా వస్తుందంటే మినీమన్ గ్యారెంటీ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయేవారు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నాడు. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కు విపరీతమైన ఫాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి ఆయన ఏకంగా 41 మంది హీరోయిన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన అలాగే 21ఏళ్లు ఉత్తమ నటుడిగా ఉన్నారు ఆయన. ఇంతకూ ఆయన ఎవరంటే..
ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. టాలీవుడ్ నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ డబ్బిగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారారు. దాదాపు 200కు పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు రాజేంద్రప్రసాద్. ఇక ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు రాజేంద్ర ప్రసాద్.
తెలుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ది ఓ అద్భుతమైన ప్రస్థానం.. కామెడీ హీరోగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి 41మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు రాజేంద్ర ప్రసాద్. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నారు. కామెడీ హీరోగా ఏకంగా 21ఏళ్లు ఉత్తమ నటుడిగా నిలిచారు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాలను ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పద్మశ్రీ అవార్డు రావడం పై రాజేంద్ర ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదం అని అన్నారు రాజేంద్ర ప్రసాద్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




