Mahesh Babu : అప్పుడు మహేష్ బాబుతో స్పెషల్ సాంగ్.. ఇప్పుడు అదే హీరోకు తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. ఈ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు.

Mahesh Babu : అప్పుడు మహేష్ బాబుతో స్పెషల్ సాంగ్.. ఇప్పుడు అదే హీరోకు తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
Mahesh Babu

Updated on: Jul 16, 2025 | 8:51 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్వకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. సినీరంగంలో ఎప్పుడు ఏ కాంబో సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ.. మరో సినిమాలో అదే హీరోకు తల్లిగానో, చెల్లిగానో లేదంటే ఇతర రోల్స్ లోనే కనిపిస్తుంటారు. అలాగే మహేష్ బాబుకు తల్లిగా నటించింది.. అలాగే అదే హీరోతో స్పెషల్ సాంగ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

మహేష్ బాబుతో స్పెషల్ సాంగ్.. అదే హీరోకు తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ మరెవరో కాదు.. ఆమె రమ్యకృష్ణ. అవును.. మీరు విన్నది నిజమే… మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ తల్లిగా నటించింది. ఇందులో మహేష్ బాబు తల్లిగా ఇందులో రమ్యకృష్ణ యాక్టింగ్ అద్భుతం. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో తల్లిగా కనిపించిన రమ్యకృష్ణ.. అంతకు ముందు ఓ మూవీలో మహేష్ జోడిగా స్పెషల్ సాంగ్ చేసింది. ఎస్. జే సూర్య దర్శకత్వం వహించిన నాని సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో వచ్చే మార్కండేయా పాటలో రమ్యకృష్ణ, మహేష్ బాబు కలిసి నటించారు. నిజానికి థియేటర్ ప్రింట్ లో ఈ స్పెషల్ సాంగ్ లేదు.. కానీ ఆ తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటుంది రమ్యకృష్ణ. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..